అక్షరటుడే, న్యూఢిల్లీ: ఖతర్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-తని ఈ నెల 17, 18వ తేదీల్లో భారత్ పర్యటనకు రాబోతున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఇండియాకు వస్తున్నట్లు పేర్కొంది. ఆయనతో పాటు మంత్రులు, సీనియర్ అధికారులు, ప్రముఖ వ్యాపారవేత్తలతో కూడిన అత్యున్నత దౌత్య బృందం కూడా రాబోతుందని వివరించింది. వీరు భారత్ తో కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement