Advertisement

అక్షరటుడే, బిచ్కుంద: మండలకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు శుక్రవారం క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనే అంశంపై పోటీలు పెట్టారు. అలాగే మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ అశోక్, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement