అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: హెచ్‌ఐవీ నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టామని ప్రోగ్రాం జిల్లా అధికారి రాధిక అన్నారు. మంగళవారం దోమకొండలో సంచార వాహనం ద్వారా ఎల్‌ఈడీ తెరపై చిత్ర ప్రదర్శనతో అవగాహన కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రభుకిరణ్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎస్సై ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.