అక్షరటుడే, వెబ్డెస్క్: Rahul Gandhi | గుజరాత్ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బీటీంగా పనిచేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆయన శనివారం గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ముఖ్య నేతలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సొంత పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారంటూ మండిపడ్డారు. కొందరు బీజేపీకి బీ టీంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.
Rahul Gandhi | నకిలీ నేతలకు బుద్ధి చెప్పకపోతే కష్టం
నకిలీ నేతలకు బుద్ధి చెప్పకపోతే గుజరాత్ ప్రజల మనసు గెలుచుకోలేమని రాహుల్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు 22 శాతం ఓట్లు పెరిగాయని.. అసాధ్యం అనుకున్న చోట వారు సాధించి చూపించారని గుర్తు చేశారు. గుజరాత్‌లో కూడా కాంగ్రెస్‌కు 40 శాతం ఓటు బ్యాంక్ ఉందని.. కానీ పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకు రాష్ట్ర నాయకులు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది సరైన పద్ధతి కాదని.. అందరూ పార్టీ లైన్‌లో ఉండి పనిచేయాలని సూచించారు. గీత దాటిన వారిపై వేటు తప్పదంటూ హెచ్చరించినట్లు సమాచారం.