Advertisement

అక్షరటుడే, బోధన్‌: ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి శివారులో గల ఓ దాబాలో అక్రమంగా విక్రయిస్తున్న మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. పక్కా సమాచారం మేరకు మంగళవారం దాబాలో తనిఖీ చేయగా, 29 లీటర్ల మద్యం పట్టుబడినట్లు పేర్కొన్నారు. మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Advertisement