అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండల కేంద్రంలో ఎస్సై చైతన్య కుమార్‌ రెడ్డి సిబ్బందితో కలిసి పలు పాన్‌ షాపులపై దాడులు నిర్వహించారు. నిషేధిత గుట్కా, టోబ్యాకో ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు షాపుల్లో గుట్కా ప్యాకెట్లు లభించగా వాటిని సీజ్‌ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లను అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.