చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

0

అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నర్సాపూర్ – నాగర్సోల్ రైలులో ఓ ప్రయాణికురాలి నుంచి బంగారు గొలుసు చోరీ చేసిన నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని ఇస్లాంపురాకు చెందిన నిందితుడు షేక్ ఇబ్రహీంను బుధవారం రిమాండ్ కి తరలించినట్లు ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. నిందితుడి నుంచి 4 తులాల బంగారు గొలుసు రికవరీ చేశారు. సిబ్బంది హాన్మండ్లు, కుబేరుడు, రాములు, సలావుద్దీన్ పాల్గొన్నారు.