అక్షరటుడే, వెబ్డెస్క్ : temperature | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ పరిసర ప్రాంతంలో ఏర్పడిన ఆవర్తనంతో రానున్న నాలుగు రోజులు తెలంగాణ Telangana వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది. రెండు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. అంతేగాకుండా పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
temperature | ఆందోళనలో రైతులు
వాతావరణ శాఖ Meteorological Department హెచ్చరికతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి పంట కోత paddy crop దశకు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో కోతలు కూడా ప్రారంభించారు. ఈ సమయంలో వర్షం పడితే వడ్లు రాలిపోయే అవకాశం ఉంది. కోసిన ధాన్యం తడిపోతుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.