అక్షరటుడే, ఎల్లారెడ్డి : Farmers | కొన్ని రోజులుగా ఉక్కపోతతో(Heat) ఇబ్బంది పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఎండ వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనంపై వరుణుడు కరుణించాడు. జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం (Weather) చల్లబడింది. పలు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షం కురిసింది. దీంతో ప్రజలు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. లింగంపేట, కామారెడ్డి, రాజంపేట మండల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది.
Farmers | పంటలకు మేలు
ఎండలు మండుతుండటం, భూగర్భ జలాలు(Ground Water) పడిపోవడంతో జిల్లాలో చాలా చోట్ల వరి పంట (Paddy Crop) ఎండుముఖం పడుతోంది. సాగునీరందక రైతులు(Farmers) ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో కురిసిన చిరుజల్లులు పంటలకు జీవం పోశాయి. రైతుల ఆశలను సజీవంగా ఉంచాయి. ఇంకో రెండు తడుల్లో చేతికచ్చే పంటలకు ఈ వర్షం ఎంతో మేలు చేసిందని రైతులు అంటున్నారు.
Farmers | వాతావరణ శాఖ హెచ్చరిక
కామారెడ్డి జిల్లాలో శుక్రవారం రాత్రి ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే వర్షాలతో పంటలకు మేలే అయినా.. ఈదురు గాలులు వీస్తే నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలులు వీచినా, వడగళ్లు పడ్డా వరి పంటకు నష్టం వాటిల్లుతుంది.