అక్షరటుడే, వెబ్‌డెస్క్ IPL 2025 : ఐపీఎల్ 2025 IPL 2025 సమరం ఈ రోజు నుండి మొదలు కానుండగా, తొలి మ్యాచ్ ipl first match కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు వారికి ఒక బ్యాడ్ న్యూస్. శనివారం (మార్చి 22వ తేదీన) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ Eden Gardens వేదికగా జరిగే మ్యాచ్ వర్షం కారణంగా క్యాన్సిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.
ఇప్పుడు కోల్‌కతాలో వర్షం(Today colcatta weather) కురుస్తుండగా, పిచ్‌ని కవర్స్‌తో కప్పి ఉంచారు.. 80 శాతంకి పైగా ఈ రోజు వర్షం Rain కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది. మినిమం ఓవర్స్ కూడా ఆడే ఛాన్స్ లేకుండా వర్షం ఇలాగే కొనసాగితే. ఇరు జట్లకూ చెరో పాయింట్ ఇస్తారు.
IPL 2025 : వర్షం ముప్పు..
సీజన్ తొలి మ్యాచ్ కావడంతో Eden Gardens ఈడెన్ గార్డెన్ వేదికగా ప్రారంభ వేడుక నిర్వహించాల్సి ఉంది. ఐపీఎల్ ప్రారంభ వేడుకల కోసం ఏర్పాట్లు చేయగా.. ఫ్యాన్స్ కూడా ఈ వేడుకను ఆస్వాదించేందుకు రెడి అయ్యారు. కానీ కోల్‌కతాలో రెండు రోజుల పాటు Rain వర్షం కురిసే అవకాశం ఉందని తెలియడంతో అభిమానులు చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బంగాళాఖాతంలో వాతావరణ మార్పుల కారణంగా మార్చి 20 నుంచి 22 వరకు పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా Meteorological Department వాతావరణ శాఖ తెలిపింది.
దాదాపు ఈ రోజు మ్యాచ్ జరిగే అవకాశం అయితే ఉండదు అని అంటున్నారు. ఐపీఎల్ 2024 ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ Kolkata Knight Riders తన సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో 2025 సీజన్ మొదటి మ్యాచ్ బెంగళూరుతో ఆడనుంది. రెండు జట్లు కూడా విజయంతో ఈ టోర్నీని ప్రారంభించాలని అనుకున్నాయి. కానీ వాతావరణ మార్పుల వల్ల తొలి మ్యాచ్‌పై అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి ఫామ్‌లో కనిపించిన కోహ్లీ ఐపీఎల్‌లో మెరుపులు మెరిపిస్తాడని అందరు ఆశగా ఎదురు చూస్తుండగా, ఇప్పుడు ఈ వార్త అభిమానులకి తీవ్ర నిరాశనే మిగిల్చింది.