Raja Singh | మరోసారి సొంతపార్టీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Raja Singh | మరోసారి సొంతపార్టీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Raja Singh | మరోసారి సొంతపార్టీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Raja Singh | బీజేపీ నేత, గోషామహల్​(Gosha Mahal) ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh)​ మరోసారి సొంతపార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన వరుసగా పార్టీ నేతలపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మాట్లాడుతూ.. బీజేపీ(BJP)లో ఉన్న పెద్ద అధికారి మేకప్ మ్యాన్(Makeup Man) అని ఆరోపించారు. ఆయన టేబుల్ ఎవరు క్లీన్ చేస్తే వాళ్లకే పదవులు ఇస్తారన్నారు.

Advertisement
Advertisement

తాను నిర్వహిస్తున్న శ్రీరామనవమి శోభాయాత్ర(Sri Ramanavami procession)కు తక్కువ మంది వచ్చేలా కొందరు బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని రాజాసింగ్​ ఆరోపించారు. అందుకోసమే అంబర్​పేట్ నుంచి గౌతమ్ రావు శోభయాత్ర చేస్తున్నారన్నారు. అలా చేసినందుకే ఆయనకు టికెట్(Ticket)​ ఇచ్చారని ఆరోపించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  MLA DHANPAL | నగరంలోని సమస్యల పరిష్కారానికి కృషి: ధన్​పాల్​

ఇటీవల కూడా రాజాసింగ్​ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర నాయకులు అధ్యక్షుడిని ఎంపిక చేస్తే రబ్బర్​ స్టాంప్(Rubber stamp)​లాగా మారుతారని వ్యాఖ్యలు చేశారు. అలాగే సీఎం(CM)తో రహస్య మీటింగ్​(Secret meeting)లు పెట్టని వ్యక్తికి పదవి ఇవ్వాలని కోరారు. తనపై పీడీ యాక్ట్​ పెట్టి జైలులో వేయడానికి కొందరు తమ పార్టీ నేతలు సహకరించారని ఆరోపించారు. సొంతపార్టీపై రాజాసింగ్(Raja Singh)​ వ్యాఖ్యలు వైరల్​ అవుతున్నాయి.

Advertisement