అక్షరటుడే, భిక్కనూరు: ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ఈ నెల 4 వరకు కాంటాలు ప్రారంభించకపోతే 5న వడ్లను నేరుగా కలెక్టరేట్‌కు తీసుకొస్తామని రాజంపేట సొసైటీ వైస్‌ఛైర్మన్ ఆముదాల రమేశ్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. రైతులు వడ్లు ఆరబెట్టి కొనుగోలు కేంద్రాల ప్రారంభం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారన్నారు. వర్షాల కారణంగా ధాన్యం తడిసి ముద్దవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్రాలు ప్రారంభించకపోతే ధాన్యాన్ని కలెక్టరేట్‌కు తీసుకొస్తామని పేర్కొన్నారు.