అక్షరటుడే, బాన్సువాడ : బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఫార్మసిస్ట్ రాజశేఖర్ జోగిపేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా శుక్రవారం ఆయనకు ఆస్పత్రిలో ఘన నివాళులు అర్పించారు. సూపరింటెండెంట్ విజయలక్ష్మి మాట్లాడుతూ విధి నిర్వహణలో ఆయన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎమ్వో సుజాత, విజయ భాస్కర్, నవీన్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.