అక్షరటుడే, వెబ్‌డెస్క్ Rajendra Prasad : నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన (Robinhood) రాబిన్ హుడ్ సినిమా మరో 4 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా లో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ (David Warner) డేవిడ్ వార్నర్ కూడా స్పెషల్ క్యామియో చేశారు. ఆదివారం (Robinhood) రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఆ ఈవెంట్ కి (David Warner) వార్నర్ కూడా స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.
ఐతే ఈ ఈవెంట్ లో (David Warner) డేవిడ్ వార్నర్ పై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) చేసిన కామెంట్స్ కాస్త విరల్ అయ్యాయి. ఆయన ఒక సీనియర్ నటుడు పరిశ్రమలో దాదాపు 3 దశబ్ధాల నుంచి ఉన్నాడు. ఆయన పెద్ద వాడు కాబట్టి ఏదన్నా పర్లేదు అంటే కష్టమే కదా.. (David Warner) డేవిడ్ వార్నర్ గురించి చెబుతూ ఒర్యే వార్నర్.. క్రికెట్ ఆడేవాడు.. దొంగ ముం.. తక్కువ వాడేం కాదు అని వార్నర్ చేసిన శ్రీవల్లి చెప్పు స్టెప్పు చూపించారు.
Rajendra Prasad : దేశం కాని దేశం నుంచి వచ్చి
వార్నర్ మీద నిజంగానే (Rajendra Prasad) రాజేంద్ర ప్రసాద్ కి అభిమానం ఉండొచ్చు కానీ.. అతన్ని ఇలా దూషించడం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు. ముఖ్యంగా అతనొక స్టార్ క్రికెటర్ దేశం కాని దేశం నుంచి వచ్చి మన దగ్గర సినిమా చేస్తున్నాడు. అలాంటిది అతన్ని గౌరవించాల్సింది పోయి ఇలా అవమానించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. రాజేంద్ర ప్రసాద్ లాంటి నటుడు ఇలా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరచింది.
ఐతే (David Warner) వార్నర్ కి తెలుగు రాదు అర్ధం కాదు కాబట్టి సరిపోయింది. అదే తెలుగు తెలుసిన ఎవరినైనా ఇలా అంటే బాబోయ్ ఇంకా ఏమైనా ఉందా.. (Rajendra Prasad) రాజేంద్ర ప్రసాద్ కూడా కావాలని అలా అని ఉండకపోవచ్చు కానీ అలా అనడం మాత్ర్మ్ తప్పే. ఈ విషయం మీడియా ఇంకాస్త పెద్దది చేస్తే డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ (Rajendra Prasad) రాజేంద్ర ప్రసాద్ చేత సారీ చెప్పించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్ (Robinhood) ఈవెంట్ సూపర్ హిట్ కాగా వార్నర్ రాకతో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.