అక్షరటుడే, ఆర్మూర్: కమ్మర్ పల్లి మండలం కోనాపూర్ శివారులోని రాళ్లవాగు ఇటీవల కురిసిన వర్షాలతో జలకళను సంతరించుకుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే ఈ వాగు పూర్తిగా నిండగా . 30 అడుగుల ఎత్తు నుంచి అలుగు ప్రవహిస్తుండడంతో జలపాతాన్ని తలపిస్తోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి పర్యాటకులు తరలివచ్చి తిలకిస్తున్నారు. అలుగు నీటిలో ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు.