Ram Charan : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న చరణ్ లుక్స్.. ఇది చాలు అంటున్న మెగా ఫ్యాన్స్..!

Ram Charan : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న చరణ్ లుక్స్.. ఇది చాలు అంటున్న మెగా ఫ్యాన్స్..!
Ram Charan : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న చరణ్ లుక్స్.. ఇది చాలు అంటున్న మెగా ఫ్యాన్స్..!
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Ram Charan : గేం ఛేంజర్ ఫ్లాప్ తో మెగా ఫ్యాన్స్ కాస్త బాధపడ్డా ఆ నెక్స్ట్ వచ్చిన ఆరెంజ్ రీ రిలీజ్ తో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. రీ రిలీజ్ హంగామాతో గేం ఛేంజర్ ఫ్లాప్ అన్న విషయాన్ని కూడా మర్చిపోయారు మెగా ఫ్యాన్స్. ఐతే ప్రస్తుతం ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబుతో చరణ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ కథతో వస్తుందట. ఈ సినిమాలో రాం చరణ్ లుక్ నెక్స్ట్ లెవెల్ అని టాక్.

గుబురు గడ్డంతో రాం చరణ్ మరోసారి అదరగొట్టబోతున్నాడని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాలో లుక్ ఎలా ఉంటుందో లీక్స్ రాలేదు కానీ రాం చరణ్ ప్రెజెంట్ లుక్ మాత్రం అదిరిపోయింది. రీసెంట్ గా ఒక పెళ్లిలో పాల్గొన్న చరణ్ సూటు బూటుతో లుక్స్ తో రచ్చ చేశాడు. చరణ్ లుక్ చూసి మెగా ఫ్యాన్స్ ఈ లుక్స్ తో బుచ్చి బాబు సినిమాలో ఉంటే చాలని అంటున్నారు. రాం చరణ్ 16వ సినిమా మీద ఫుల్ ఫోకస్ తో పనిచేస్తున్నాడు.

ఇది కూడా చ‌ద‌వండి :  Ram Charan : రామ్ చరణ్ తో విశ్వంభర డైరెక్టర్.. బాహుబలి రేంజ్ సినిమా..?

Ram Charan : ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చేలా..

గేం ఛేంజర్ రిజల్ట్ వల్ల ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ సినిమా ఎలాగైనా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చేలా చేయాలని చూస్తున్నారు. అందుకే ఏ ఛాన్స్ కూడా వదలట్లేదని తెలుస్తుంది. చరణ్ బుచ్చిబాబు ఈ కాంబో సినిమా విషయంలో మేకర్స్ కూడా నో కాంప్రమైజ్ అనేస్తున్నారట. సినిమాను లెక్కకు మించి ఉండేలా చేస్తున్నారట.

జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఆర్సీ 16 సినిమాలో కన్నడ స్టార్ శివన్న అదే శివ రాజ్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. సినిమాలో ఆ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది. సో మెగా పవర్ స్టార్ అలియాస్ గ్లోబల్ స్టార్ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండేలా చూస్తున్నాడట బుచ్చి బాబు. మరి ఈ సినిమా ఆశించిన రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది చూడాలి.

Advertisement