Ram Pothineni : ఆంధ్ర కింగ్ తాలూకా అంటున్న రామ్.. ఇన్ స్టంట్ గా ఎక్కేసిందిగా..!

Ram Pothineni : ఆంధ్ర కింగ్ తాలూకా అంటున్న రామ్.. ఇన్ స్టంట్ గా ఎక్కేసిందిగా..!
Ram Pothineni : ఆంధ్ర కింగ్ తాలూకా అంటున్న రామ్.. ఇన్ స్టంట్ గా ఎక్కేసిందిగా..!
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్ Ram Pothineni : ఉస్తాద్ రామ్ హీరోగా యువ దర్శకుడు మహేష్ బాబు పి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో రామ్ యంగ్ లుక్ అదిరిపోయేలా ఉంది. ఇప్పటికే సినిమాకు సంబందించిన షూటింగ్ క్లిప్స్ కొన్ని సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. వీటితో పాటుగా లేటెస్ట్ గా సినిమా టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

రామ్ మహేష్ బాబు కాంబో సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అని టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఆంధ్ర కింగ్ తాలూకా టైటిల్ ఇలా బయటకు రాగానే అలా ట్రెండింగ్ లోకి వచ్చింది. ముఖ్యంగా తాలూకా ట్యాగ్ లైన్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవగానే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే పోస్టర్స్ చాలా కనిపించాయి.

Ram Pothineni : రామ్ సినిమాకు అదే తరహాలో ఆంధ్ర కింగ్ తాలూకా..

ఇప్పుడు రామ్ సినిమాకు అదే తరహాలో ఆంధ్ర కింగ్ తాలూకా అని పెట్టడం సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా టైటిల్ తోనే ఆడియన్స్ కి ఇన్ స్టంట్ గా ఎక్కేసింది. ఇక సినిమాలో రాం, భాగ్య శ్రీ రొమాన్స్ ఒక రేంజ్ లో ఉండఓబోతుందని తెలుస్తుంది. కొన్నాళ్లుగా సరైన హిట్లు లేక సతమతమవుతున్న రామ్ ఈసారి పక్కా హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు.

ఇది కూడా చ‌ద‌వండి :  Ram : రామ్ కొత్త లుక్ షూటింగ్ వీడియో లీక్.. ఈసారి హిట్టు కొట్టి తీరాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉన్నాడుగా..!

రామ్ భాగ్య శ్రీ జోడీ కూడా ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. రామ్ ఈ సినిమాలో యంగ్ లుక్ తో అనిపించనున్నాడు. మరి ఆంధ్ర కింగ్ తాలూకా కథ ఏంటో కానీ రామ్ ఫ్యాన్స్ మాత్రం సినిమాపై భారీ అంచనాలు పెటుకున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా కుదిరితే సమ్మర్ లేదా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ రిలీజ్ చేస్తారై తెలుస్తుంది.

Advertisement