అక్షరటుడే, వెబ్ డెస్క్: రెవెన్యూ అధికారులు వారసత్వ పట్టా చేయడం లేదంటూ రామారెడ్డి మండలం ఉప్పల్ వాయికి చెందిన రైతు మంత్రి భగవాన్ ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన తహసీల్దార్ సువర్ణ బుధవారం ఫీల్డ్ సర్వేకు వెళ్లి పరిశీలించారు. విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతు భగవాన్ మాట్లాడుతూ.. విచారణలో భూమి తనదని తేలితే తప్పకుండా న్యాయం చేస్తానని తహసీల్దార్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నాడు.