Ramdev Baba | వివాదాస్పదంగా మారిన రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలు

Ramdev Baba | వివాదంలో చిక్కుకున్న రామ్‌దేవ్ బాబా
Ramdev Baba | వివాదంలో చిక్కుకున్న రామ్‌దేవ్ బాబా

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ramdev Baba | ప్ర‌ముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా yoga guru Ramdev Baba చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. ష‌ర్బత్‌లు sharbats అమ్మే ఓ కంపెనీ దాని ద్వారా వ‌చ్చే ఆదాయాన్ని మ‌సీదులు, మ‌ద‌ర్సాల‌ను నిర్మిస్తోంద‌ని వెల్ల‌డించారు. దాన్ని ష‌ర్బ‌త్ జిహాద్‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. రామ్‌దేవ్‌బాబా మాట్లాడిన వీడియోను పతంజలి ప్రొడక్ట్స్’ఫేస్‌బుక్‌లో Patanjali Products on Facebook షేర్ చేసింది. “మీ కుటుంబాన్ని, అమాయక పిల్లలను శీతల పానీయాల పేరుతో అమ్ముతున్న టాయిలెట్ క్లీనర్ విషం నుంచి రక్షించండి. పతంజలి షర్బత్, జ్యూస్‌లను Patanjali sharbats and juices మాత్రమే ఇంటికి తీసుకెళ్లండి” అని పేర్కొంది.

Advertisement

వేసవిలో దాహం తీర్చుకోవడం పేరుతో శీతల పానీయాలను తాగడం టాయిలెట్ క్లీనర్ లాంటిదని రామ్‌దేవ్ ఈ వీడియోలో విమర్శించారు. “వేసవిలో దాహం తీర్చుకోవడం పేరుతో, ప్రజలు ప్రధానంగా టాయిలెట్ క్లీనర్‌లైన toilet cleaners శీతల పానీయాలను తాగుతారు. ఒక వైపు, టాయిలెట్ క్లీనర్ toilet cleaners లాంటి విషం దాడి poison attack జరుగుతుంది, మరోవైపు, షర్బత్ అమ్మే కంపెనీ ఉంది. దాని నుంచి సంపాదించిన డబ్బును మసీదులు, మదర్సాలు నిర్మించడానికి ఉపయోగిస్తుంది. అది సరే, అది వారి మతం” అని రామ్‌దేవ్ వ్యాఖ్యానించారు.

Ramdev Baba | ఆ ష‌ర్బ‌త్ తాగితే మ‌సీదుల‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లే

స‌ద‌రు కంపెనీ ష‌ర్బత్ తాగితే మసీదులు, మ‌ద‌ర్సాల‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లేన‌ని రామ్‌దేవ్ బాబా Ramdev Bab అన్నారు. అదే మీరు ప‌తంజ‌లి గ్రూప్ గులాబీ ష‌ర్బ‌త్ drink Patanjali Group’s pink sherbet తాగితే అది గురుకులాలు, ప‌తంజ‌లి విశ్వ‌విద్యాల‌యం, భార‌తీయ శిక్షబోర్డు Indian Board of Education ఏర్పాటుకు మ‌ద్దతు తెలిపిన వారు అవుతార‌ని పేర్కొన్నారు. ల‌వ్ జిహాద్‌, ఓటు జిహాద్ ఉన్న‌ట్లే ష‌ర్బ‌త్ జిహాద్ కూడా ఉంది. ఈ ష‌ర్బ‌త్ జిహాద్ నుంచి మిమ్మ‌ల్ని మీరు ర‌క్షించుకోవాల‌ని రామ్‌దేవ్ సూచించారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను కొంద‌రు స‌మ‌ర్థిస్తే మ‌రికొంద‌రు వ్య‌తిరేకిస్తూ పోస్టులు పెడుతున్నారు.

ప‌తంజ‌లి వ్యాపారం business మందగించ‌డంతో త‌న కొత్త ఉత్ప‌త్తుల‌ను ప్ర‌మోట్ చేసుకోవ‌డానికి ఈ త‌ర‌హా ట్రిక్కుల‌కు పాల్ప‌డుతున్నార‌ని కొంద‌రు ఆరోపించారు. గ‌తంలోనూ రామ్‌దేవ్ బాబా వివాదాల్లో చిక్కుకున్నారు. ప‌తంజ‌లి ఉత్ప‌త్తులు తీవ్ర‌మైన అనారోగ్యాల‌ను న‌యం చేయ‌గ‌ల‌వ‌ని ప్ర‌చారం చేయ‌డంతో అది సుప్రీంకోర్టుకు చేరింది. అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశాల‌తో ఆయ‌న క్ష‌మాప‌ణ చెప్పాల్సి వ‌చ్చింది.

Advertisement