Nani : నానికి తల్లిగా రమ్యకృష్ణ నో చెప్పిందా.. రీజన్ తెలిస్తే షాక్ అవుతారు..?

Nani : నానికి తల్లిగా రమ్యకృష్ణ నో చెప్పిందా.. రీజన్ తెలిస్తే షాక్ అవుతారు..?
Nani : నానికి తల్లిగా రమ్యకృష్ణ నో చెప్పిందా.. రీజన్ తెలిస్తే షాక్ అవుతారు..?
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Nani : టాలీవుడ్ లో స్వశక్తితో ఎదిగిన వారిలో న్యాచురల్ స్టార్ నాని ఒకరు. ఒకప్పుడు చిరంజీవి ఆ తర్వాత రవితేజె ఎలా అయితే సినిమాల్లోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయ్యారో ఆ తర్వాత నాని గురించి అందరు అలా చెప్పుకుంటున్నారు. అంతేకాదు తాను ఎదుగుతూ మరో పది మందిని ఇండస్ట్రీలో అవకాశాలు ఇస్తూ నాని ఎంతోమందికి స్పూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. నాని సినిమా అంటే చాలు మినిమం గ్యారెంటీ అనే రేంజ్ కి వెళ్లాడు.

లాస్ట్ ఇయర్ సరిపోదా శనివారం సినిమా చేసిన నాని ఆ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఇక త్వరలో హిట్ థర్డ్ కేస్ తో రాబోతున్నాడు నాని. ఈ సినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. హిట్ 3 సినిమా తర్వాత నాని మరోసారి శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు ప్యారడైజ్ అనే టైటిల్ లాక్ చేశారు. ఈమధ్యనే ఆ సినిమా నుంచి ఒక గ్లింప్స్ వచ్చింది.

Nani : ప్యారడైజ్ రా స్టేట్మెంట్..

ప్యారడైజ్ రా స్టేట్మెంట్ అంటూ ఒక ఫిమేల్ వాయిస్ ఓవర్ తో సినిమా కథ ఏంటన్నది చెప్పాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఐతే ఈ సినిమాలో హీరో తల్లి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది. ఐతే ఆ అవకాశం ఎవరు అందుకున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఎందుకంటే ఈ సినిమాలో ముందు ఆ పాత్ర కోసం రమ్యకృష్ణని అనుకున్నారట. నాని ఇంకా డైరెక్టర్ వెళ్లి కథ చెప్పినట్టు టాక్.

ఇది కూడా చ‌ద‌వండి :  Janhvi Kapoor | బ‌ర్త్ డే రోజు జాన్వీ క‌పూర్ కేక పెట్టించే అందాల‌తో చంపేస్తుందిగా..!

నాని తల్లి పాత్ర అయితే ఓకే కానీ సినిమాలో ఆమె చాలా బోల్డ్ రోల్ ఇంకా డైలాగ్స్ కూడా చాలా పచ్చిగా పలకాల్సి ఉందని అందుకే సినిమా చేయనని చెప్పిందట రమ్యకృష్ణ. ఐతే క్యారెక్టర్ మాత్రం అదిరిపోయింది కానీ తను మరీ అలా చేయలేనని అన్నదట. ఐతే రమ్యకృష్ణ కాదన్న ఆ పాత్ర కోసం ప్రస్తుతం వేట కొనసాగిస్తున్నారు మేకర్స్.మరి రమ్యకృష్ణ కాదన్న ఈ రోల్ ఎవరు చేస్తారన్నది చూడాలి.

Advertisement