Advertisement
అక్షరటుడే, బిచ్కుంద: FLAG MARCH | మండల కేంద్రంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించింది. అంబేడ్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ మీదుగా కుమ్మరి చెరువు వరకు సిబ్బంది కవాతు నిర్వహించారు. రాబోయే పండుగలను అందరూ కలిసి మెలిసి జరుపుకోవాలని సీఐ జగడం నరేష్ సూచించారు. ప్రజలకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, మేమున్నామనే భరోసా కల్పించడం ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమాండెంట్ టీపీ భాగిల్, ఇన్స్పెక్టర్ మల్లేశ్వర్రావు, 40 మంది సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement