Rashmika | దేవరకొండ హీరోకి రష్మిక బర్త్ డే విసెష్.. ఎన్నాళ్లు ఈ దాగుడుమూతలు అమ్మడు..!

Rashmika | దేవరకొండ హీరోకి రష్మిక బర్త్ డే విసెష్.. ఎన్నాళ్లు ఈ దాగుడుమూతలు అమ్మడు..!
Rashmika | దేవరకొండ హీరోకి రష్మిక బర్త్ డే విసెష్.. ఎన్నాళ్లు ఈ దాగుడుమూతలు అమ్మడు..!
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌:

Advertisement
Rashmika | నేషనల్ క్రష్ రష్మిక మందన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇద్దరు చాలా క్లోజ్ అన్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అన్నది తెలియదు కానీ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు అన్నది మాత్రం తెలుస్తుంది. ఓ పక్క సినిమాల్లో ఇద్దరు రాణిస్తుండగా పర్సనల్ లైఫ్ లో ఇద్దరు చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరు ప్రేమలో ఉన్నారన్న వార్తలు రావడమే కానీ వాళ్లు కన్ ఫర్మ్ చేయలేదు.

ఐతే రష్మిక మాత్రం ఎప్పటికప్పుడు తన ప్రేమ చూపిస్తూనే ఉంటుంది. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండకు బర్త్ డే విసెష్ చెప్పింది రష్మిక. మామూలుగా కాల్ చేసి విష్ చేసి ఉండొచ్చు కానీ అమ్మడు తన ఇన్ స్టాగ్రాంలో స్టేటస్ గా పెట్టుకుంది. హ్యాపీ బర్త్ డే ఆనందా అంటూ ఆనంద్ దేవరకొండని ట్యాగ్ చేసింది. విజయ్ తమ్ముడికి రష్మిక స్పెషల్ విసెష్ మళ్లీ తెర మీదకు విజయ్, రష్మిక ల మ్యాటర్ వచ్చేలా చేసింది.

ఇది కూడా చ‌ద‌వండి :  Vijay Deverakonda : విజయ్ దేవరకొండ డిమాండ్ కి బిగ్ బాస్ టీం షాక్.. ఎన్ని కోట్లు అడిగాడంటే..?

Rashmika | ఛావాతో సూపర్ హిట్..

ఇక సినిమాల విషయానికి వస్తే ఈమధ్యనే ఛావాతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక ప్రస్తుతం కుబేర, సికందర్, గర్ల్ ఫ్రెండ్ సినిమాలు చేస్తుంది. మరోపక్క విజయ్ దేవరకొండ కింగ్ డం సినిమా చేస్తున్నాడు. కింగ్ డం సినిమా మే లో రిలీజ్ లాక్ చేశారు. ఈమధ్యనే వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.

రష్మిక మందన్న కుబేర, సికందర్ రెండు సినిమాలు సమ్మర్ రిలీజ్ కాబోతున్నాయి. కెరీర్ లో ఇద్దరు ఒక రేంజ్ లో దూసుకెళ్తున్నారు. ఐతే పర్సనల్ లైఫ్, వారి లవ్ స్టోరీ గురించి మాత్రం లీక్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. దేవరకొండ తమ్ముడు ఆనంద్ కి రష్మిక విసెష్ అందించడంతో మరోసారి రౌడీ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ వచ్చేలా చేసింది. ఆఫ్ స్క్రీన్ ఏమో కానీ విజయ్ దేవరకొండ, రష్మిక మళ్లీ తెర మీద కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.