అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సమాజంలో ఉన్న విభేదాలను పక్కనబెట్టి హిందువులంతా ఐక్యం కావాలని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మెహన్‌ భగవత్‌ పిలుపునిచ్చారు. రాజస్థాన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిరంతరం చర్చల ద్వారా హిందువులు ఎంతో సామరస్యంతో జీవిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పనితీరు యాంత్రికమైనది కాదని, ఆలోచనపై ఆధారపడి పనిచేస్తుందని తెలిపారు. సామాజిక సామరస్యం, న్యాయం, ఆరోగ్యం, విద్య, స్వావలంబనపై ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు దృష్టి కేంద్రీకరించాలన్నారు.