అక్షరటుడే, భిక్కనూరు: రాష్ట్రంలో హిందూ ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలు పెరిగాయని భిక్కనూరులో సోమవారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ హిందువుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రతినిధులు సంజయ్, రమేశ్, రవీందర్, నర్సింలు, నరేశ్ బాబు, సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు.