Advertisement
అక్షరటుడే, బిచ్కుంద: Ration Shop | మండల కేంద్రంలోని 20 నంబర్ రేషన్ దుకాణంలో బియ్యం బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు బిచ్కుంద రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవీందర్ విచారణ చేపట్టారు. అనంతరం దుకాణాన్ని సీజ్ చేశారు.
రేషన్ డీలర్‌పై కేసు నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపామని రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవీందర్ వెల్లడించారు. పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యాన్ని రేషన్ డీలర్లు గాని, రైస్ మిల్లర్లు గాని పక్కదారి పట్టిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Advertisement