అక్షరటుడే, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్ళిన ఓ రోగిని ఎలుకలు కరిచిన ఘటన శనివారం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన ముజీబ్ అనే రోగిని ఎలుకలు కరువగా కాళ్లు, చేతుల భాగంలో తీవ్ర రక్తస్రావం అయ్యింది. బాధితుడు అనారోగ్య సమస్యతో కొద్ది రోజులుగా ఇక్కడి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో ఇక్కడ చికిత్స పొందుతున్న ఇతర రోగులు ఆందోళన చెందుతున్నారు.