అక్షరటుడే, జుక్కల్‌ : జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పిట్లం మండలం సిద్ధాపూర్‌ తండాకు చెందిన రవి మృతి చెందాడు. సిద్దాపూర్‌ తండాకు చెందిన రవి బైక్‌పై పిట్లం వైపు వెళ్తుండగా మంగళూరు గేటు దాటిన తర్వాత గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. స్పందించిన జాతీయ రహదారి అంబులెన్స్‌ సిబ్బంది క్షతగాత్రుడిని పిట్లం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. పిట్లం ఎస్సై రాజుకు సమాచారం ఇచ్చినట్లు అంబులెన్స్‌ సిబ్బంది తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Eye medical camp | అంగన్​వాడీ కేంద్రంలో కంటి వైద్యశిబిరం