Raviteja Mass Jathara : మాస్ జాతర గోల్డెన్ సర్ ప్రైజ్.. ఇడియట్ సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ హంగామా..!

Raviteja Mass Jathara : మాస్ జాతర గోల్డెన్ సర్ ప్రైజ్.. ఇడియట్ సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ హంగామా..!
Raviteja Mass Jathara : మాస్ జాతర గోల్డెన్ సర్ ప్రైజ్.. ఇడియట్ సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ హంగామా..!

అక్షరటుడే, వెబ్ డెస్క్ Raviteja Mass Jathara : మాస్ మహారాజ్ (Mass Maharaj) శ్రీలీల (Sreeleela) జంటగా భాను భోగవరపు డైరెక్షన్​లో వస్తున్న సినిమా మాస్ జాతర. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్​లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ తో మాస్ రాజా ఫ్యాన్స్​ని ఖుషి చేశారు. మాస్ జాతర సినిమా (Mass Jathara Movie) నుంచి గోల్డెన్ సర్ ప్రైజ్ అంటూ సాంగ్ ప్రోమో వదిలారు. అందులో రవితేజ (Raviteja) ఇడియట్​లోని సూపర్ హిట్ సాంగ్ చూపుల్తో గుచ్చి గుచ్చి మ్యూజిక్ తో అలరించాడు. అదే తరహా స్టెప్స్​ కూడా చేశారు.

Advertisement
Advertisement

సో మాస్ జాతర సినిమాలో గోల్డెన్ సర్ ప్రైజ్​గా ఇడియట్ సాంగ్ రీమిక్స్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సాంగ్ ను ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నారు. సాంగ్ ప్రోమోతోనే ఒక మాస్ వైబ్​ని తీసుకొచ్చారు మేకర్స్. ముఖ్యంగా రవితేజ (hero Raviteja) కొన్నాళ్లుగా సరైన హిట్లు లేక సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో మాస్ జాతర సినిమా కోసం మాస్ సాంగ్ రీమిక్స్ చేయడం అదిరిపోయింది.

Raviteja Mass Jathara : మాస్ జాతరపై సూపర్ క్రేజ్..

సామజవరగమణ సినిమాతో మంచి రైటర్ గా ప్రూవ్ చేసుకున్న భాను.. ఈసారి మెగా ఫోన్ పట్టి చేస్తున్న సినిమాగా మాస్ జాతరపై (Mass Jathara Movie) సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లాన్ అదిరిపోయింది. సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ధమాకా తర్వాత రవితేజ, (Raviteja) శ్రీలీల (Sreeleela) చేస్తున్న సినిమా అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగాయి.

రవితేజ(Raviteja) ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాస్ జాతర సినిమాతో రవితేజ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. సితార బ్యానర్ నుంచి వస్తున్న ఈమధ్య సినిమాలన్నీ సక్సెస్ లు అందుకుంటున్నాయి కాబట్టి తప్పకుండా మాస్ జాతర (Mass Jathara Movie)  అనుకున్న టార్గెట్ అందుకుంటుందేమో చూడాలి.

Advertisement