అక్షరటుడే, వెబ్డెస్క్: RBI | రుణ గ్రహీతలకు కేంద్ర రిజర్వ్ బ్యాంకు(Central Reserve Bank) గుడ్‌న్యూస్ తెలిపింది. కీలక వడ్డీ రేట్లను పావు శాతం (0.25) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గత పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా(RBI Governor Sanjay Malhotra) బుధవారం ప్రకటించారు. విశ్లేషకుల అంచనాలు నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను సవరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 6.25 శాతంగా ఉన్న రెపో రేటును 6శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. గత ఫిబ్రవరిలోనూ ఆర్‌బీఐ(RBI) కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. తాజా తగ్గింపుతో రుణ గ్రహీతలపై వడ్డీ భారం తగ్గనుంది. గృహ(House), వాహన(Vehicle) ఇంటి రుణాల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.
RBI | వృద్ధి రేటు 6.5 శాతం
భారత వృద్ధి రేటును స్వల్పంగా ఆర్‌బీఐ(RBI) స్వల్పంగా తగ్గించింది. ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో గతంలో అంచనా వేసిన 6.7 శాతం వృద్ధిని ప్రస్తుతం 6.5 శాతానికి సవరిస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి సమావేశంలో అంచనా వేసిన 6.7 శాతంగా ఉంటుందని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ఇటీవల ప్రకటించిన సుంకాలు ప్రపంచ సెంటిమెంట్(World sentiment)ను దెబ్బతీశాయని, అనిశ్చితికి ఆజ్యం పోశాయని ఆర్‌బీఐ చీఫ్ మల్హోత్రా(RBI Chief Malhotra) అన్నారు. వాణిజ్య ఘర్షణల కారణంగా ప్రపంచ వృద్ధిపై పడే ప్రభావం దేశీయ వృద్ధికి కూడా ఆటంకం కలిగిస్తుందని వివరించారు. అధిక సుంకాలు(High tariffs) నికర ఎగుమతులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని చెప్పారు. ప్రపంచ వృద్ధి మందగమనం వల్ల కమోడిటీ, ముడి చమురు ధరలు మరింత తగ్గుతాయన్నారు. ఆరోగ్యకరమైన రిజర్వ్ స్థాయిలు, బలమైన పంట ఉత్పత్తి నేపథ్యంలో వ్యవసాయ రంగం అవకాశాలు ప్రకాశవంతంగా ఉన్నాయని తెలిపారు