అక్షరటుడే, వెబ్​డెస్క్: ముంబైలోని న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌కు ఆర్బీఐ నోటీసులు జారీ చేసింది. ఆరు నెలల పాటు అన్ని ఆర్థిక కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. తమ నుంచి ముందస్తు అనుమతి లేకుండా రుణాలు, అడ్వాన్స్‌లను మంజూరు చేయొద్దని పేర్కొంది. ఆ బ్యాంకుల్లో కొత్తగా ఎవరూ పెట్టుబడి పెట్టొద్దని నోటీసుల్లో పేర్కొంది. బ్యాంకులో ఆర్థిక ద్రవ్యస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. నగదు లావాదేవీలపై కూడా ఆంక్షలు విధించడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. డబ్బులు డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు పరుగులు పెట్టారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  KTR | చెరువును తాకట్టు పెట్టిన రేవంత్ రెడ్డి: కేటీఆర్​