అక్షరటుడే, వెబ్ డెస్క్ RCB : ఐపీఎల్ టీమ్స్‌లో ఆర్సీబీ (RCB) టీమ్‌కి ఉన్న ప్రత్యేకత గురించి సపరేట్‌గా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ (Virat Kohli) వలన (RCB) ఆర్సీబీ టీంకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఐపీఎల్‌లో బడా ఫ్రాంచైజీలైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)కు ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ రెండు జట్లకు ఉన్నంత డై హార్డ్ ఫ్యాన్స్ మరే ఇతర టీమ్‌లకు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ రెండు జట్లు ఎక్కడ ఆడినా స్టేడియాలు అభిమానులతో నిండిపోవాల్సిందే. అటు (Social media) సోషల్ మీడియాలోనూ ఆర్‌సీబీ, సీఎస్‌కేకు అదే స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో వరుసగా రెండు మ్యాచ్‌లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటింది. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)పై వారి సొంత మైదానంలో ఘన విజయం సాధించి క్రికెట్ ప్రేమికుల మనసులను దోచుకుంది. ఈ విజయంతో ఇన్‌స్టాగ్రామ్ Instagramలో ఆర్సీబీ హవా కొనసాగుతోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన జాబితాలో, సీఎస్కేను అధిగమించి ఆర్సీబీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం, చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 17.7 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, ఆర్సీబీ తాజాగా 17.8 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో (IPL season) ఆర్సీబీ, సీఎస్కేతో పోల్చితే మెరుగైన ప్రదర్శనను అందిస్తోంది. ఐపీఎల్ టీమ్‌లలో మరే జట్టుకు లేనంతగా 1.78 కోట్ల మంది బెంగళూరు ఫ్రాంచైజీని అనుసరిస్తున్నారు. దాంతో, ఐదుసార్లు చాంపియన్ అయిన చెన్నై రెండో స్థానానికి పడిపోయింది. సీఎస్‌కేకు CSK ఇన్‌స్టాలో ప్రస్తుతం 1.77 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా అభిమానులున్న ఐపీఎల్ జట్లలో ముంబై ఇండియన్స్ మూడో స్థానంలో ఉంది. సీఎస్కేతో సమానంగా ఐదు టైటిళ్లు సాధించిన ముంబైని 1.62 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటి నుంచి బెంగళూరు ఫ్యాన్స్ తమ జట్టు తొలి టైటిల్ గెలిస్తే చూసి తరించాలని కళ్లలో వత్తులు వేసుకొని చూస్తున్నారు. మూడు పర్యాయాలు(2009, 2011, 2016) ఫైనల్ చేరిన ఆర్సీబీ.. ఆఖరి మెట్టుపై చతికిలపడింది. అయితే 18వ సీజన్‌లో బెంగళూరు జట్టు వరుసగా రెండు విక్టరీలతో టైటిల్‌పై ఆశలు రేపుతోంది. అందుకే.. ఇన్‌స్టాలో ఎక్కువ మంది ఆర్సీబీ ఫ్రాంచైజీని పెద్ద మొత్తంలో ఫాలో అవుతున్నారు.