అక్షరటుడే, బోధన్: బోధన్ డివిజన్‌లోని బోధన్, కోటగిరి, రెంజల్, ఎడపల్లి, రుద్రూర్ మండలాల్లో ఖాళీగా ఉన్న 18 రేషన్ దుకాణాలను నడిపేందుకు డీలర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. రిజర్వేషన్ పద్ధతిన భర్తీ చేస్తున్నామని, ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 13 వరకు బోధన్ ఆర్డీవో కార్యాలయంలో సమర్పించాలని సుచించారు. దరఖాస్తుకు జతపరిచే ధ్రువపత్రాలపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలని పేర్కొన్నారు. రాత పరీక్ష ఈ నెల 26న ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.