అక్షరటుడే, ఎల్లారెడ్డి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుల గణన సర్వేకు ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని ఆర్డీవో ప్రభాకర్ అన్నారు. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లలో శనివారం సర్వేను పరిశీలించారు. కులగణనపై వస్తున్న అపోహలు, అసత్యాలు నమ్మవద్దని ప్రజలకు తెలిపారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. ఆయన వెంట తహసీల్దార్ మహేందర్, ఎంపీడీవో ప్రకాశ్, ఏఈవో రాజా గౌడ్ ఉన్నారు.