అక్షరటుడే, ఎల్లారెడ్డి: శని, ఆదివారాల్లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టినట్లు ఆర్డీవో ప్రభాకర్ తెలిపారు. శనివారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఓటర్ నమోదు కేంద్రాలను ఆయన పరిశీలించారు. జనవరి 1, 2025 నాటికి 18 ఏళ్లు నిండిన యువత ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. తప్పుల సవరణ, అడ్రస్ మార్పు(ఫారం-8), చనిపోయిన వారి పేర్లు జాబితా నుంచి తొలగింపు కోసం (ఫారం-7) దరఖాస్తులు సైతం ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంలో స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు తహసీల్దార్ మహేందర్, శ్రీనివాస్ ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Yellareddy | చుక్క గోపాల్ గౌడ్​కు ‘భారత్ విభూషణ్’​