Advertisement
అక్షరటుడే, ఎల్లారెడ్డి: నర్సరీలో మొక్కల సంరక్షణ సక్రమంగా చేపట్టాలని ఆర్డీవో ప్రభాకర్ సూచించారు. మండలంలోని బ్రాహ్మణపల్లి నర్సరీని ఆయన శుక్రవారం పరిశీలించారు. నర్సరీలో పెరుగుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో నాటేందుకు మొక్కలను సంసిద్ధం చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఆయనతోపాటు ఎంపీడీవో ప్రకాశ్, సంగమేశ్వర్ రెడ్డి తదితరులున్నారు.
Advertisement