అక్షరటుడే, ఎల్లారెడ్డి: వసతిగృహాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆర్డీవో ప్రభాకర్ సూచించారు. ఆయన శనివారం బాలికల వసతిగృహాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వారికి అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. వసతిగృహంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని విద్యార్థులకు ఆర్డీవో హామీ ఇచ్చారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చదువు, ఆటల్లో రాణించాలని సూచించారు. ఆయన వెంట ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ శ్రీకాంత్, కమిషనర్ శ్రీహరి రాజు, ఎంఈవో వెంకటేశం, వార్డెన్ శారద పాల్గొన్నారు.