అక్షరటుడే, వెబ్‌డెస్క్: Trump tariff | సుంకాల పెంపుతో వాణిజ్య యుద్ధానికి తెర లేపిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ US President Donald Trump తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. టారిఫ్‌లపై చర్చలకు సిద్ధమని ప్రకటించారు. అమెరికా నుంచి ఇతర దేశాలు వసూలు చేస్తున్న దాని ఆధారంగానే తాము కూడా టారిఫ్‌లు విధించామన్నారు. ఇదంతా పరస్పర చర్యేనని, ఇప్పుడు కొత్త సుంకాలు అమల్లోకి రాగానే ఇతర దేశాలు తమ గురించి ఆలోచించడం మొదలు పెట్టాయన్నారు. తమ నిర్ణయంతో అమెరికా మళ్లీ చోదక స్థానంలోకి వస్తుందన్నారు. టారిఫ్‌ల పెంపుతో ఇప్పుడు చాలా దేశాలు మాకోసం ఏదైనా చేస్తామని అంటున్నాయని, అలా ఏ దేశమైనా ముందుకొచ్చి ఆఫర్ ఇస్తే టారిఫ్‌లపై చర్చించేందుకు సిద్ధమేనని ప్రకటించారు.
Trump tariff | స్పందన బాగుంది..
కొత్తగా ప్రకటించిన సుంకాలకు స్పందన చాలా బాగుందని ట్రంప్ అన్నారు. “ఇది చాలా బాగా జరుగుతుందని నేను భావిస్తున్నా. ఇది రోగికి శస్త్రచికిత్స చేసే ఆపరేషన్ లాంటిదనిష వ్యాఖ్యానించారు. “ఇది ఖచ్చితంగా అలాగే ఉంటుందని నేను చెప్పాను. మన దేశానికి 6 లేదా 7 ట్రిలియన్ డాలర్లు trillion dollars వస్తున్నాయి, మనం ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. మార్కెట్లు వృద్ధి చెందుతాయి, స్టాక్ stocks వృద్ధి చెందుతుంది, దేశం వృద్ధి చెందుతుంది” అని ట్రంప్ అన్నారు.
Trump tariff | మార్కెట్లు విలవిల..
భారత్ India సహా వివిధ దేశాలపై ట్రంప్ భారీ స్థాయిలో టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండ్రోజులుగా ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. ట్రంప్ వాణిజ్య యుద్ధానికి ప్రతిస్పందనగా ప్రపంచ స్టాక్‌లు Global stocks కుప్పకూలాయి. ట్రంప్ వాణిజ్య యుద్ధానికి దేశాలు స్పందించడంతో, గురు, శుక్రవారాల్లో మార్కెట్లు పడిపోయాయి. వాల్ స్ట్రీట్‌లో పదునైన తగ్గుదలకు దారితీసింది. 2020 తర్వాత S&P 500 భారీగా పతనమైంది. 4.8% పడిపోయింది. నాస్‌డాక్ 6.0%, డౌ జోన్స్ 4.0% క్షీణించింది. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో, టోక్యో Tokyo ప్రాథమిక నిక్కీ 225 సూచిక 1.8 శాతం తగ్గుదలను నమోదు చేసింది. మన మార్కెట్లు కూడా శుక్రవారం భారీగా పతనమయ్యాయి. నిఫ్టీ ఒకదశలో 300, సెన్సెక్స్ 800 పాయింట్ల మేర కోల్పోయింది.