అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి సబ్ స్టేషన్ నుంచి లింగాపూర్ శివారు వరకు విద్యుత్ హైటెన్షన్ వైర్ల కింద 83 ఫీట్ల రోడ్డు ఏర్పాటుకు రియల్టర్లు అంగీకారం తెలిపారు. మంగళవారం జిల్లా ఉన్నతాధికారులను కలిసి అంగీకార పత్రాలు అందజేశారు. గతంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి విజ్ఞప్తి మేరకు స్పందించారు. మున్సిపల్ అధికారులు రోడ్డుకు మార్కింగ్ చేశారు.