అక్షరటుడే, వెబ్ డెస్క్: ఇటీవల మార్కెట్లో లిస్టయిన వారీ ఎనర్జీస్ అదరగొడుతోంది. రూ. 1503 బేస్ ప్రైస్ తో ఐపీవోకు వచ్చిన ఈ కంపెనీ.. గత నెల 28న స్టాక్ మార్కెట్లో రూ. 2,500 వద్ద లిస్టయిన విషయం తెలిసిందే.. అంటే ఐపీవో అలాట్ అయిన వారికి తొలిరోజే 66 శాతం లాభాలను ఇచ్చిందన్న మాట. ఈ కంపెనీ అదే జోరును కొనసాగిస్తోంది. కేవలం 8 సెషన్లలోనే స్టాక్ ప్రైస్ రూ. 3,636కు చేరి ఐపీవో ఇన్వెస్టర్లకు 141 శాతం లాభాన్ని ఆర్జించి పెట్టింది.