Stock market | ప్రపంచ మార్కెట్లలో రెసిషన్‌ భయం.. భారీగా పతనమైన యూఎస్‌, యూరోప్‌ ఇండెక్స్‌లు

Stock market | ప్రపంచ మార్కెట్లలో రెసిషన్‌ భయం.. భారీగా పతనమైన యూఎస్‌, యూరోప్‌ ఇండెక్స్‌లు
Stock market | ప్రపంచ మార్కెట్లలో రెసిషన్‌ భయం.. భారీగా పతనమైన యూఎస్‌, యూరోప్‌ ఇండెక్స్‌లు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన టారిఫ్‌(Tariff)లతో అంతటా రెసిషన్‌ భయాలు పెరుగుతున్నాయి. దీంతో గ్లోబల్‌ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. గురువారం యూఎస్‌(US)కు చెందిన ఎస్‌అండ్‌పీ 4.84 శాతం నష్టపోగా నాస్‌డాక్‌(Nasdaq) 5.97 శాతం పతనమైంది. డౌజోన్స్‌ ఫ్యూచర్‌ సైతం నెగెటివ్‌లోనే ట్రేడ్‌ అవుతోంది. కోవిడ్‌ పాండమిక్‌ డేస్‌ తర్వాత అమెరికా మార్కెట్లు ఒక రోజులో ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు యూరోప్‌ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఎఫ్‌టీఎస్‌ఈ 1.58 శాతం పడిపోగా సీఏసీ 3.42 శాతం, డీఏఎక్స్‌ 3.12 శాతం పడిపోయాయి. ఆసియా మార్కెట్లదీ ఇదే దారి. జపాన్‌కు చెందిన నిక్కాయ్‌(Nikkei) 2.75 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రేయిట్స్‌ టైమ్స్‌ 2.71 శాతం, సౌత్‌ కొరియాకు చెందిన కోప్సి 0.52 శాతం నష్టంతో ఉన్నాయి.

Advertisement
Advertisement

Stock market | గమనించాల్సిన అంశాలు

ఎఫ్‌ఐఐ(FII)లు గురువారం మన మార్కెట్లలో నికర అమ్మకందారులుగా నిలిచారు. వారు నికరంగా రూ. 2,806 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు. డీఐఐ(DII)లు రూ. 221 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.
బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 0.49 శాతం తగ్గి 69.79 డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఇయర్స్‌ బాండ్‌ ఈల్డ్‌ 0.72 శాతం తగ్గి 4 వద్ద కొనసాగుతోంది. ఇది ఎనిమిది నెలల కనిష్టం కావడం గమనార్హం.

ఇది కూడా చ‌ద‌వండి :  Stock market | లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

Stock market | నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

ప్రపంచ మార్కెట్లు భారీగా పతనమవుతుండడం, అమెరికా రెసిషన్‌(Recession)లోకి వెళ్లిపోవచ్చన్న అంచనాలతో గిఫ్ట్‌ నిఫ్టీ కూడా నష్టాలతో ట్రేడ్‌ అవుతోంది. ఉదయం 8.30 గంటల సమయంలో 104 పాయింట్ల(0.47 శాతం) నష్టంతో కదలాడుతోంది. దీని ప్రకారం గురువారం ఉదయం మన మార్కెట్లు కూడా నష్టాలతోనే ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాయి.

Advertisement