అక్షరటుడే, వెబ్డెస్క్: జిల్లాలో రక్తం కొరత ఉందని రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా చైర్మన్ ఆంజనేయులు అన్నారు. గణేష్ మండపాల వద్ద అన్నదానాలతో పాటు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రక్తదానం చేయడం ద్వారా తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులు, డెంగీ బారిన పడిన వారి ప్రాణాలను కాపాడొచ్చన్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించేలా రెడ్ క్రాస్ సభ్యులు చొరవ చూపాలని ఆయన కోరారు.