అక్షరటుడే, ఇందూరు : బోధన్‌కు చెందిన కమల మృతి చెందగా ఆమె మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించారు. సోమవారం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అప్పగించారు. ఆమె కూతుళ్లు స్వర్ణలత, హేమలత సమ్మతితో వైద్య కళాశాల ప్రొఫెసర్ రవీనా పౌల్, ప్రొఫెసర్ డా బాల్‌రాజ్‌కు అప్పగించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్సా ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ పాల్గొన్నారు.