Dubai | దుబాయ్​లో రెడ్డిపేట వాసి మృతి

Dubai | దుబాయ్​లో రెడ్డిపేట వాసి మృతి
Dubai | దుబాయ్​లో రెడ్డిపేట వాసి మృతి

అక్షరటుడే, కామారెడ్డి: Dubai : రెండు నెలల్లో సెలవు మీద ఇంటికి రావాలనుకున్న అతడిని విధి వక్రించింది. పొట్ట కూటి కోసం దుబాయ్​ వెళ్లి కుటుంబానికి అండగా ఉండాలని, అప్పు లేకుండా ప్రశాంతంగా జీవించాలన్న అతడి ఆశలు అడియాశలయ్యాయి. బ్రెయిన్ స్ట్రోక్ బలితీసుకుని, ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా చేసింది.

Advertisement

గల్ఫ్ సంక్షేమ సంఘం(Gulf Welfare Association) రామారెడ్డి మండల అధ్యక్షుడు బండ సురేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా రెడ్డిపేట గ్రామానికి చెందిన బట్టు సురేష్(35) రెండేళ్ల క్రితం విజిట్ వర్క్ వీసా మీద దుబాయ్​ వెళ్లాడు. అక్కడ లేబర్ గా పని చేస్తున్నాడు. కాగా.. ఈ నెల 12న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మృతి చెందారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Police | కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి

గల్ఫ్ లో ఉన్న బట్టు శంకర్, నవీన్ అనే ఇద్దరు వ్యక్తులు ఇండియన్ ఎంబసీ(Indian Embassy)తో మాట్లాడి సురేష్ మృతదేహాన్ని ఇంటికి పంపించడానికి ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం 10 గంటల వరకు స్వగ్రామానికి మృతదేహం చేరుకోనుంది. సురేష్​కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గల్ఫ్ సంక్షేమ సంఘం రామారెడ్డి మండల అధ్యక్షుడు బండ సురేందర్ రెడ్డి కోరారు. ప్రభుత్వం ప్రకటించిన గల్ఫ్ ఎక్స్ గ్రేషియా అందేలా చర్యలు తీసుకుని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement