Rithu Chowdary : బెట్టింగ్ యాప్స్ (Betting apps) వల్ల ప్రజల ప్రాణాలు బలవుతున్నాయని పోలీసులు వారిపై కేసు ఫైల్ చేసి విచారణ నిర్వహిస్తున్నారు. ఇందులో సినీ సెలబ్రిటీస్ తో పాటుగా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్, బుల్లితెర నటీనటులు ఉన్నారు. జబర్దస్త్ లో మెప్పించిన రీతూ చౌదరి (Rithu Chowdary) కూడా ఈ బెట్టింగ్ యాప్స్ (Betting apps) ప్రమోషన్స్ చేసింది. ఆమెను నిన్న విచారణ చేశారు. ఐతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఎక్కడెక్కడ చేశారు. దాని నుంచి ఎంత మొత్తం పొందారు.
దాన్ని మరలా ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు లాంటి విషయాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు ఏయే మాధ్యమాల్లో బెట్టింగ్ యాప్స్ (Betting apps) ప్రమోట్ చేశారన్నది కూడా పోలీసులు అడిగి తెలుసుకున్నారని తెలుస్తుంది. ఐతే ఈ క్రమంలో రీతూ చౌదరి (Rithu Chowdary) తన కో యాంకర్ విష్ణు ప్రియని అడ్డంగా బుక్ చేసిందని తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ గురించి తనకు విష్ణు ప్రియానే చెప్పిందని.. తనకు తనే దగ్గర నుంచి ఎలా చేయాలి.. ఎలా చెప్పాలి అన్నది చెప్పిందని రీతూ చౌదరి చెప్పింది.
Rithu Chowdary : విష్ణు ప్రియ రిస్క్ లో పడినట్టు..
ఐతే రీతూ చౌదరి (Rithu Chowdary) తన పేరు చెప్పడంతో విష్ణు ప్రియ (Vishnu Priya) రిస్క్ లో పడినట్టు అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 8 Bigg Boss Season 8 లో విష్ణు ప్రియ (Vishnu Priya) సందడి చేసిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ కేసు వల్ల ఇలాంటి వాళ్లంతా కూడా రిస్క్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈజీ మనీ కోసం (Betting apps) బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఇలాంటి వాళ్లంతా కూడా లక్షలు సంపాదిస్తున్నారు.
వీరి వల్ల అమాయక ప్రజలు బలవుతున్నారు. తెలంగాణ పోలీసులు యాక్షన్ లోకి దిగిన తర్వాత ఒక్కొక్కరు కూడా ఇక మీద బెట్టింగ్ యాప్స్ (Betting apps) జోలికి వెళ్లేది లేదని అంటున్నారు. ఐతే పోలీసులు వీళ్లని అంత తేలికగా వదిలి పెట్టకూడదని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి ఈ కేసులో విచారణలో పాల్గొన్న వారిపై ఆధారాలు వెల్లడైతే అరెస్ట్ చేస్తారా లేదా అన్నది చూడాలి.