అక్షరటుడే, ఇందూరు : ఏబీవీపీ తో విద్యార్థుల్లో జాతీయ భావం కలుగుతుందని ప్రాంత సంఘటన కార్యదర్శి లవన్ కుమార్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ పాఠశాలలో విభాగ్ అభ్యస వర్గ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1949లో మొదలైన ఏబీవీపీ దేశం కోసం ఎన్నో ఉద్యమాలు చేసిందని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ‘నా రక్తం ..నా తెలంగాణ’ పేరుతో 20 వేల మంది కార్యకర్తలు ఒకేరోజు రక్తదానం చేసిన ఘనత పరిషత్ కు చెందుతుందన్నారు. కార్యక్రమంలో విభాగ్ ప్రముఖ రెంజర్ల నరేష్, విభాగ్ సంఘటన మంత్రి రాజు సాగర్, జాతీయ కార్యవర్గ సభ్యులు శివకుమార్, నిర్మల్ జిల్లా ప్రముఖ్ వినోద్, ఇందూరు జిల్లా ప్రముఖ్ ఈశ్వర్, నగర అధ్యక్షుడు వెంకటకృష్ణ, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్ ప్రతినిధులు పాల్గొన్నారు.