అక్షరటుడే, భిక్కనూరు: తెలంగాణ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా భిక్కనూరు జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం రేకులపల్లి రాజగంగారెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో శనివారం జరిగిన ఎన్నికల్లో 103 ఓట్లతో ఆయన గెలిచారు. దీంతో పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.