అక్షరటుడే, కామారెడ్డి: CMRF | అనారోగ్యం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్(CMRF) ఉపశమనం కలిగిస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali) అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో 24 మంది లబ్ధిదారులకు రూ. 20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తాను పేదలకు అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు(DCC PRESIDENT) కైలాస్ శ్రీనివాస్ రావు, గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.