అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ నగర శివారులోని భారతిరాణి కాలనీ బొందం గడ్డ చెరువు ఆక్రమణలపై అధికారులు సీరియస్ అయ్యారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన రేకుల షెడ్లు, తాత్కాలిక నివాసాలను కూల్చివేశారు. ఆర్డీవో రాజేంద్ర కుమార్, తహసీల్దార్లు, పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం చెరువు ప్రాంతంలో పరిశీలించారు. కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వాటిని జేసీబీలతో కూల్చివేయించారు. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement