Advertisement
అక్షరటుడే, భీమ్‌గల్ : Bhimgal | మండలంలోని గోన్ గొప్పుల్ గ్రామంలో ఇళ్లలో నల్లాలకు అక్రమంగా బిగించిన ఎలక్ట్రిక్ మోటార్లను మున్సిపల్ సిబ్బంది సీజ్ చేశారు. 8 మోటార్లను సీజ్ చేసినట్లు స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. వేసవికాలం తాగునీటి సరఫరా చర్యల్లో భాగంగా శుక్రవారం గ్రామంలోని అన్ని నల్లా కనెక్షన్లను, తాగునీటి సరఫరా పైప్‌లైన్లను తనిఖీ చేశామన్నారు. గ్రామంలో ఎక్కడ నల్లాలకు మోటార్లు బిగించినా సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement