అక్షరటుడే, వెబ్‌డెస్క్ Renu Desai : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారారు. ఆయన గురించి తెగ ముచ్చటించుకున్నారు. స్టార్ హీరోగా ఉండి పదేళ్ల పాటు అనేక అవమానాలు ఎదుర్కొని రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రజా సేవలో ఉన్నారు. గతేడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి 70వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా భారీ విజయాన్ని సొంతం చేసుకొని ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా ఉండి ప్రజా సేవ చేస్తున్నారు. ఇక ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు చేస్తూ తీరికలేనంత బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్.
Renu Desai : నిజస్వరూపం ఇదే..
అయితే పవన్ కళ్యాణ్ ఎంత గొప్ప వ్యక్తి అయిన కూడా అతనిని కొందరు పెళ్లిళ్ల విషయంలో విమర్శిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రస్తుతం పవర్ స్టార్ నుంచి విడిపోయి సెపరేట్ గా ఉంటూ కొన్ని సందర్భాలలో ఆయన గురించి మాట్లాడుతూ ఉంటుంది. అయితే రీసెంట్‌గా రేణూ ఆయన గొప్పతనం గురించి, నిజస్వరూపం ఎలాంటిదో చెపింది. ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ కుడి చేతితో చేసిన సాయం.. ఎడమ చేతికి కూడా తెలియనివ్వరు అని తెలిపింది రేణూ.. నిర్మాతలే కాకుండా.. చాలా మంది సినీ తారలకు, ఆర్టిస్టులకు పవన్ తనకు వీలైనంత వరకు సాయం చేస్తూనే ఉంటారని ప్రముఖులు కూడా ఆయా సందర్భాల్లో చెప్పారు.
తనను నమ్మిన నిర్మాతలను ఏమాత్రం కష్టపెట్టకుండా చూసుకుంటారని రేణు దేశాయ్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. రేణు దేశాయ్‌ని ప్రేమించి పెళ్లాడిన పవన్ కళ్యాణ్.. కొన్నేళ్ళకు ఆమెతో డివోర్స్ తీసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పవన్- రేణు దేశాయ్ విడిపోవడం ఇప్పటికీ మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. వారు విడిపోయి చాలా సంవత్సరాలు అయినప్పటికీ, అప్పుడప్పుడూ తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేస్తూనే ఉంటుంది రేణూ దేశాయ్. ఈ సందర్భంలో కొందరు రేణూ దేశాయ్‌పై విమర్శలు కూడా చేస్తుంటారు.